Thursday 15 August 2013

శ్రీ శిరిడీ సాయి లీలామృతం (అధ్యాయం - 06)


శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకుండా భుజించిన ఆహారము పాపభూయిష్టమైనదని , అందువలన నిష్కృతి లేని పాపాలను మూటగట్టుకుందురని . అదేవిధంగా భగవంతునికి అర్పించి, పావనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్యమని అందువలన జీవునకు ఇహం లోనూ , పరం లోనూ శ్రేయస్సు కలుగుతుంగని సెలవిచ్చి ఉన్నారు. ఈ గీతా సారాన్ని కలియుగ దైవం , భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీసాయినాధులు తనదైన రీతిలో భక్తులకు బోధించారు. ఆ లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

శిరిడీలో ప్రతీ ఆదివారం సంత జరిగేది. చుట్టు పక్కల గ్రామాలనుండి ప్రజలు వచ్చి ఆ వారానికి కావలసిన సరుకులను కొనుకొని తిరిగి వెళ్ళిపోయేవారు.వెళ్ళెముందు వారు మశీదుకు వచ్చి సాయిని దర్శించుకోవడం ఒక అలవాటు. ఒక ఆదివారం ఎప్పటివలెనే మశిదు కిక్కిరిసిపోయి వున్నాది.

హేమాద్రిపంత్ బాబా ముందు కూర్చోని ఆయన పాదములను ఒత్తుతూ మనస్సులో నామజపం చేసుకుంటున్నాడు. బాబా గారి ఎడమవైపున శ్యామా, కుడివైపున బూటీ, కాకా దీక్షిత్ కుడా కూర్చోని వున్నారు. అప్పుడు శ్యామ నవ్వుతూ, " హేమాద్రిపంత్ జీ, నీ కోటుకు శనగ గింజలు అంటినవి చూడు " అని అన్నాడు. అంతే కాక హేమాద్రిపంత్ చొక్కా చేతులను తట్టగా కొన్ని శనగ గింజలు రాలిపడ్డయి.హేమాద్పంత్ వెంటనె తన చేతులను ముందుకు చాచగే మరి కొన్ని శనగపు గింజలు రాలి పడ్దాయి.

ఈ సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శనగలు చోక్కా చేతుల లోపలకు ఎలా ప్రవేశించాయో ఎవరికి తోచినట్లు వారు ఊహించనారంభించారు. అప్పుడు శ్రీసాయి కల్పించుకొని " ఆ హేమాద్పంతుకు తాను తిన్నప్పుడు ఇంక ఎవ్వరికీ పెట్టని దుర్గుణము వున్నాది. ఈ రోజు సంతలో శనగలు కొని తానొక్కాడే తంటూ ఇకడికి వచ్చాడు" అని అన్నారు. సాయి మాటలకు హేమాడ్పంతు ఒకింత ఆశ్చర్య పడి " బాబా ! నేనెప్పుడూ దేనినీ ఒంటరిగా తిని ఎరుగను. ఈ రోజు దాకా శిరిడీ లోని సంత ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు.ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు, అయినప్పుడు నేను శనగలు ఎలా కొని వుండగలను ?నా దగ్గర ఏ వస్తువైనా వున్నప్పుడు దానిని దగ్గర వున్నవారికి పంచి ఇవ్వకుండా నేనొక్కడినీ తినే అలవాటు నాకు లేదు. అటువంటప్పుడు ఈ దుర్గుణమును , అభాండమును ఏల నాపై మోపెదవు ? " అని అడిగాడు.అప్పుడు సాయి చిరునవ్వుతో " భావూ (తమ్ముడా !)దగ్గర వున్నప్పుడు ఇంకొకరికి పంచి ఇస్తావు కానీ ఎవరూ లేన్నప్పుడు ఏం చేస్తావు? తినెటప్పుడు కనీసం నన్ను స్మరిస్తావా ?నేనెల్లప్పుడు నీ చెంత లేనా ?నీవేదైనా తిన్నేటప్పుడు నాకు అర్పిస్తున్నావా ?" ఆ మాటలకు హేమాద్పంత్ ముఖం చిన్నబోయింది. బాబా మాటలలోని అర్ధం అక్కడు కూర్చున్న వారందరికీ అవగతమై అందరి అజ్ఞానం పటాపంచలు అయ్యి జ్ఞానోదయం అయ్యింది.

హేమాద్పంత్ శనగలు తినుటను ఆసరాగా చేసుకొని శ్రీ సాయి ఒక అద్భుతమైన, అపూర్వమైన బోధను చేసారు.మనస్సు, బుద్ధి పంచేంద్రియముల కంటే ముందుగా విషయములను అనుభవిస్తాయి, కనుక మమము ముందే ఏ విషయానైననూ భగవదర్పితం చేయాలి.అప్పుడు మనకు ఆ విషయములందు అభిమానము అదృశ్యమైపోతుంది.విషయములను అనుభవించే మూందు బాబా మన చెంతనే వున్నట్లు భావించినచో ఆ వస్తువును మనము అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఉదయించి తద్వారా వైరాగ్యం, వివేకము ఉదయిస్తాయి. అధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.మనము మన సద్గురువును లేదా ఇష్ట దైవమును స్మరించనిదే ఏ పనినీ చేయరాదు. మనస్సును ఈ విధముగా క్రమశిక్షణతో వుంచినట్లయితే శ్రీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన,అత్యద్భుతమైన కరుణా కటాక్షాలకు పాత్రులమవుతాము.
శ్రీ సాయి చేసిన ఈ భోధనామృతమును మనసారా వంటబట్టించుకొని భక్తులందరూ తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు


సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

1 comment:

Unknown said...

nice information
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel